సైకిలెక్కిన కుర్ర హీరోNikhil
2020-06-18 18:18:38

సాధారణంగా, కొత్తగా పెళ్ళైన కుర్రాళ్ళు ఇంతకు ముందులా తమ బాడీ మెయింటైన్ చేయడం అంటే కష్టమనే చెప్పాలి. అయితే కుర్ర హీరో నిఖిల్ మాత్రం అదేమీ లేదంటున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంటర్ అయ్యి తనకంటూ మార్కెట్ ఏర్పరుచుకున్న ఈ నటుడు లాక్ దౌన్ లో పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడయ్యాడు. తాను ప్రేమించిన పల్లవి వర్మ అనే డాక్టర్ ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. ఇక ఇప్పుడు ఆయన పర్యావరణం మీద ప్రేమతో పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ సైకిల్ ఒకటి అందుకున్నాడు. ఈవ్ కనెక్ట్స అనే సంస్థ రూపొందించిన ఈ సైకిల్ ఒక్క సారి చార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. గంటకు దాదాపు 30 కిమీ వేగంతో వెళ్ళే ఈ సైకిల్ వాడకంతో పర్యావరణానికి తనవంతు సాయం చేస్తున్నానని నిఖిల్ పేర్కొన్నాడు. అర్జున్ సురవరం సినిమాతో వచ్చిన అలరించిన నిఖిల్ ప్రస్తుతం తనకి హిట్ ఇచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు. లాక్ డౌన్ సడలింపులు లభించిన క్రమంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందేమో చూడాలి మరి.

More Related Stories