డిజిటల్ రిలీజ్ కి రెడీ అయిన గోపీ ఆరడుగుల బులెట్...gopichand
2020-06-20 23:25:54

కొన్నిరోజుల క్రితం దాకా చిన్న సినిమాలు, అలాగే సరిగా రాలేదు అనుకున్న సినిమాలకి మోక్షం కలిగేది కాదు. ఏదో సురేష్ బాబు లాంటి వాళ్ళు  దయతలిస్తే సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒటీటీ ఎంట్రీతో అసలు అలాంటి ఇబ్బంది లేకుండా పోయాయి. ఎప్పట్నుంచో రిలీజ్ కి కాకుండా మిగిలిపోయిన సినిమాలను ఒక్కొక్కటిగా ఓటిటిలో విడుదల చేయడానికి ఆసక్తి చూస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే సందీప్ కిషన్ ఏడేళ్ల కింద నటించిన డికే బోస్ ఓటిటిలో విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోండగా పాత సినిమాలే కాక ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవ్వాల్సి ఉండి, థియేటర్ బిజినెస్ చేయడం కష్టం అనుకున్న సినిమాలను కూడా డైరెక్ట్ గా రిలీజ్ చేసేస్తున్నారు. 

తాజాగా గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా కూడా అందులోనే విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మూడేళ్ల క్రితం గోపీచంద్‌, నయనతార జంటగా సీనియర్ దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన సినిమానే ఈ ఆరడుగుల బుల్లెట్. అప్పట్లో ఈ సినిమాను విడుదల చేయాలని చాలా ప్రయత్నించినా గోపీ చంద్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా అది రిలీజ్ కి నోచుకోలేదు. ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాత రమేష్ ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. గోపీచంద్ కి మార్కెట్ లేకున్నా ఆయన సినిమాలకి డిజిటల్ పరంగా మంచి మార్కెట్ ఏ ఉంది. అదీ కాక ఎప్పుడో పూరీ డైరెక్షన్ లో వచ్చ్హిన వాంటెడ్ సినిమాని మొన్న యూ ట్యూబ్ లో అప్లోడ్ చేసినా కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. అదీ కాక నయనతార లాంటి హీరోయిన్ ఉండడంతో ఖచ్చితంగా 'ఆరడుగుల బుల్లెట్‌'కు మంచి రేటు వస్తుందనే ఆశాభావంతో నిర్మాత ఉన్నట్లు చెబుతున్నారు.  

More Related Stories