బాలీవుడ్ మీడియాను ఏకిపడేసిన కంగనాkangana ranaut
2020-06-20 17:15:34

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సుశాంత్ ఆత్మహత్య సందర్భంగా మళ్ళీ యాక్టివ్ అయింది. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లో ఉన్న నేపోటిజమే కారణమని ఆమె బల్లగుద్ది చెబుతోంది. తాజాగా ఆమె తన ఇన్స్టా గ్రామ్ లో ఒక కొత్త వీడియో పంచుకున్నారు. దీనిలో ఆమె ఒక వర్గం జర్నలిస్టులను ఇంటలేక్చువల్స్ గా అభివర్ణిస్తూ సుశాంత్ మీద రాసిన నెగటివ్ ఆర్టికల్స్ ని చదివి వినిపించింది. మీడియా సుశాంత్ కి ఎంత నరకం చూపిందో చెబుతూ కంగనా ఈ వీడియో చేసింది.  సుశాంత్‌ సినిమాలు గల్లీ బాయ్‌ లాంటి సినిమాల కంటే ఎక్కువ వసూలు చేశాయన్న కంగనా గతంలో సల్మాన్‌ ఖాన్‌ లాంటి వారు సుశాంత్‌ ఎవరని ప్రశ్నించారని అన్నారు. ఆదిత్య చోప్రా వల్ల సుశాంత్‌ నష్టపోయాడని నాకు తెలుసన్న ఆమె. 

సుల్తాన్‌ సినిమాను తిరస్కరించినప్పుడు నేను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని అన్నారు. సుల్తాన్‌ సినిమాను తిరస్కరించడంతో ఆదిత్య చోప్రా నాతో ఎప్పటికి సినిమాలు చేయనని బెదిరించాడని, ఇండస్ట్రీ మొత్తం నాకు వ్యతిరేకంగా మారిందని అన్నారు. సుశాంత్ మీద ఈ అప్రకటిత బ్యాన్ విధించేటప్పుడు పరిశ్రమలోని వ్యక్తులు అతని జీవితం ఏమైపోతుందని ఆలోచించలేదని పేర్కొంది. సుశాంత్ మరణం ఆత్మహత్య కాదు, ప్రణాళికాబద్ధమైన హత్య అని ఆమె చెప్పింది. ఇక సుశాంత్ మీద నెగటివ్ ఆర్టికల్స్ రాసిన మీడియా ఈ నెపో కిడ్స్ మీద ఎప్పుడూ నెగటివ్ ఆర్టికల్స్ రాయలేదని చెప్పుకొచ్చింది.

More Related Stories