రానా పెళ్లి వెన్యూ ఫిక్స్..ఎక్కడంటే Ranas wedding
2020-06-21 09:06:31

అదేంటో కానీ మామూలు రోజుల్లో కంటే ఈ లాక్‌డౌన్ టైంలోనే టాలీవుడ్ లో ఎక్కువ పెళ్ళిళ్ళు అయ్యాయి. అసలు ఊహించను కూడా ఊహించకుండ లాక్ డౌన్ లో తన ప్రేయసి యస్ చెప్పిందని చెప్పి షాక్ ఇచ్చాడు రానా. రానా - మిహీకాల ఫ్యామిలీ ఇటీవ‌ల త‌న పెళ్ళి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. ఆగ‌స్ట్ 18న వీరి వివాహం జ‌ర‌గ‌నున్నట్టు దగ్గుబాటి ఫ్యామిలీ వర్గాల నుండి తెలుస్తోంది. తాజాగా వీరి వివాహ వేదిక‌కి సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్‌ లో బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేటంటే వీరి కుటుంబ స్టేటస్ కు తగ్గట్టే వీరి పెళ్లిని ఫలక్‌నుమా ప్యాలెస్ లో కుటుంబ స‌భ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో జరపనున్నట్టు చెబుతున్నారు. 

ఇటీవ‌లే రామానాయుడు స్టూడియోలో రానా, మిహీకాల రోకా వేడుకని కుటుంబ స‌భ్యుల మ‌ధ్య సంద‌డిగా జ‌రుపుకున్నారు. అయితే షూటింగ్స్ మొదలయిన నేపధ్యంలో స్టూడియోలో అంత సేఫ్ కాదని భావించి పెళ్లి అక్కడ ప్లాన్ చేశారని కూడా టాక్ ఉంది. ప్రస్తుతానికి అయితే పెళ్ళికి 50 మంది హాజరు కావడానికే ఛాన్స్ ఉంది. ఇక వీరి పెళ్లి ఆగష్టులో అంటున్నారు కాబట్టి అప్పటి పరిస్థితులు ఎలా ఉండ నున్నాయో చూడాలి. ఇక రానా సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయన త్వర‌లో అర‌ణ్య అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించనున్నాడు. లాక్ డౌన్ లేకుంటే అది రిలీజ్ ఇప్పటికే కావాల్సి ఉంది. ఇక ఆయన వేణు ఉడుగుల డైరెక్షన్ లో విరాటపర్వం అనే పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు

More Related Stories