అభిమానులకి షాక్‌ ఇస్తూ కొత్త లుక్‌ లోకి జయ్‌ దేవరకొండVijay Deverakonda
2020-06-22 14:22:44

విజయ్ దేవరకొండ అభిమానులకి షాకిచ్చారు. ఎవరూ ఊహించని ఒక లుక్ లో దర్శనం ఇచ్చి ఫ్యాన్స్ ని పరేషాన్ చేశారు. నిన్న ఫాదర్స్ డే సందర్భంగా ఈయన తన తండ్రి గోవర్ధన్ రావు, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. దానికి కారణం అందులో ఆయన ఉన్న లుక్. జుట్టు పెంచుకుని, స్పెషల్ ఫ్రెంచ్ కట్ బియర్డ్ తో విజయ్ కనిపిస్తున్నాడు. అయితే ఆయన ప్రస్తుతం పూరీ ఫైట‌ర్(వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో నటిస్తుండడంతో ఆయన ఈ సినిమా కోసమే ఈ లుక్ అని అంటున్నారు. 

ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టాక ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఈయనతో కిక్ బాక్సింగ్ నేపధ్యంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోండగా ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. సడలింపులు లభించాయి కాబట్టి త్వరలోనే ప్రారంభం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఈ కొత్త లుక్ ‘ఫైటర్’ కోసమేనా లేదా మరో సినిమా కోసమా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతానికి మాత్రం విజయ్‌ న్యూలుక్‌ వైరల్‌ అవుతోంది.

More Related Stories