ఓటీటీకి ఉదయ్ కిరణ్ చివరి సినిమా Uday Kiran
2020-06-23 20:26:22

ఉదయ్ కిరణ్ చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’. మోహన్ ఏఎల్‌ఆర్‌కే దర్శకత్వం వహించిన ఈ సినిమాని మున్నా నిర్మించారు. నువ్వు-నేను ఫేం అనిత ప్రత్యేక పాత్ర పోషించిన ఈ సినిమాలో గరిమ, డింపుల్, మదాలస శర్మలు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని ఆయన చనిపోయిన కొన్ని రోజులకి విడుదల చేయాలని ప్లాన్ చేసినా అది రిలీజ్ కి నోచుకోలేదు. ఈ విషయం చాలా మంది మరిచి పోయి ఉంటారు. ఇప్పుడు థియేటర్స్ కి ఓటీటీలు ఆల్టర్నేటివ్ స్ గా నిలుస్తున్న క్రమంలో ఉదయ్ కిరణ్ చిత్రం చెప్పిన కథని ఓటీటీలో రిలీజ్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో టాలీవుడ్ లో మరోసారి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చర్చకు వస్తోంది. దీనికి తోడు లాక్ డౌన్ వల్ల ఓటీటీలో సినిమాలకు డిమాండ్ పెరిగిన నేపధ్యంలో ఆరేళ్ళ నాడు రిలీజ్ కావాల్సిన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని అంటున్నారు. చూద్దాం మరి ఏమి జరగనుందో ? 

More Related Stories