ఆగష్టులో షూట్ కి వెళ్తోన్న రంగ్ దే Nithiin Rangde
2020-06-24 19:51:47

ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఒప్పుకుని నటిస్తూ బిజీగా ఉన్నాడు నితిన్‌. మొన్ననే భీష్మ హిట్ కొట్టిన ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ కరోనా కాటు వేయడంతో అది కూడా వాయిదా పడింది. ఇక ఏప్రిల్ లో జరగాల్సిన ఆయన పెళ్లిని వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో హైదరాబాద్ శివారులలో ఏదో ఒక ఫాం హౌస్ లో ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ పెళ్లి గనుక పూర్తి అయితే ఆయన వెంటనే చేయాల్సిన సినిమా రంగ్ దే. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా ‘మ‌హాన‌టి’ ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాని వెంకీ అట్లూరి దర్శకుడుగా వ్యవహరించనున్నారు. 

ఈ సినిమాని ముందుగా వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ భావించింది. అయితే కరోనా ప్రభావం కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఆగస్ట్‌లో తిరిగి షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు ఈ సినిమాకి పని చేస్తున్న సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్‌ తెలిపారు. ‘సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నాం. 70శాతం షూటింగ్‌ పూర్తయింది. మిగిలిన ముప్పై శాతాన్ని ఏకధాటిగా తెరకెక్కించనున్నాం’ అని పీసీశ్రీరామ్‌ పేర్కొన్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.

More Related Stories