మహేష్ బాబు నిర్మాణంలో శర్వానంద్ సినిమా mahesh babu
2020-06-25 16:40:17

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌వైపు హీరోగా న‌టిస్తూనే మరో పక్క తనకు నచ్చిన కధలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయనకు జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ కూడా ఉంది. ఈ బ్యానర్ తో తాను నటిస్తున్న సినిమాల్లో ఒక వాటా పెడుతున్న ఆయన తొలిసారిగా అడివి శేష్‌ తో మేజ‌ర్‌ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు మ‌హేష్ త్వర‌లో శ‌ర్వానంద్‌తో ఓ చిత్రాన్ని నిర్మించాల‌ని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకనే ఈ మధ్య మ‌హేష్ వ‌ద్దకి ఓ క‌థ వచ్చిందట, ఆ కధ విన్న ఆయన అది శ‌ర్వానంద్‌కి స‌రిగ్గా స‌రిపోతుంద‌ని భావించి ఆయన వద్దకు ఈ దర్శకుడిని పంపినట్టుగా చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో హిట్ కొట్టిన అయన ఇప్పుడు స‌ర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేయ‌నున్నాడు. ప‌ర‌శురామ్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక మరో పక్క శ‌ర్వానంద్ శ్రీకారం అనే సినిమాలో ఫార్మర్ గా నటిస్తున్నాడు. 

More Related Stories