టాలీవుడ్‌లో నిర్మాతలను నిలువునా ముంచేసిన కొన్ని సినిమాలు ఇవే..Tollywood Disaster movies
2020-06-26 14:44:32

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లతో సినిమాలు చేసినపుడు నిర్మాతలకు లాభాల పంట పండుతుందని అనుకుంటారంతా. కానీ అవే సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా నష్టాలు కూడా వస్తాయి. అలా ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో భారీ నష్టాలు తీసుకొచ్చిన కొన్ని సినిమాలు చూద్దాం..

అజ్ఞాతవాసి: పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై నభూతో అనే అంచనాలున్నాయి. కానీ విడుదల తర్వాత నభవిష్యతీ అనేలా ఫ్లాప్ అయిపోయింది అజ్ఞాతవాసి. దాదాపు 55 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం.
బ్రహ్మోత్సవం: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవం 40 కోట్ల వరకు నష్టాలు తీసుకొచ్చింది. ఆ దెబ్బకు ఇప్పటికీ ఇంకా కోలుకోలేకపోయాడు శ్రీకాంత్.
శక్తి: మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం తెచ్చిన నష్టాల నుంచి బయట పడటానికి అశ్వినీ దత్ లాంటి అగ్ర నిర్మాతకు కూడా ఏడేళ్లు పట్టిందంటే శక్తి షాక్ అర్థం చేసుకోవచ్చు. జూనియర్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్.
తుఫాన్: అప్పటి వరకు వరస విజయాలతో దూసుకుపోతూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న రామ్ చరణ్.. తుఫాన్ సినిమాతో చెత్త రికార్డ్ అందుకున్నాడు. ఈ చిత్రం దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది.
రెబల్: ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన సినిమా రెబల్. అప్పట్లో ఈ చిత్రంపై లారెన్స్‌తో గొడవ కూడా పడ్డారు నిర్మాతలు భగవాన్, పుల్లారావు.
ఒక్క మగాడు: బాలయ్య కెరీర్‌లో దారుణంగా నిరాశ పరిచిన సినిమా ఒక్క మగాడు. అప్పట్లో వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఆకాశమంత అంచనాలున్నాయి. కానీ విడుదలైన తర్వాత దారుణంగా ముంచేసాడు ఒక్క మగాడు.
స్పైడర్: మహేష్ బాబు, మురుగదాస్ లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చి 50 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చిన సినిమా స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం డిజాస్టర్ అయింది.
షాడో: వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏడేళ్ల కిందే 20 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చింది.
ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు: బాలయ్య కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం కథానాయకుడు 19 కోట్లు.. రెండో భాగం 4 కోట్లు మాత్రమే వసూలు చేసి చరిత్రలో నిలిచిపోయే చెత్త రికార్డు మూట గట్టుకుంది.
మన్మథుడు 2: నాగార్జున కెరీర్‌లో కేడీ సినిమాను మించిన డిజాస్టర్‌గా మన్మథుడు 2 నిలిచింది. అనవసరంగా పాత మన్మథుడు ఇమేజ్ దెబ్బ తీసారని దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌పై విమర్శలు కూడా వచ్చాయి.
కొమరం పులి: పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి పదేళ్ల కిందే పాతిక కోట్ల నష్టాలు తీసుకొచ్చింది.
అఖిల్: అఖిల్ అక్కినేని డెబ్యూ సినిమా అఖిల్ అత్యంత దారుణమైన ఫలితం అందుకుంది. ఈ చిత్రం కలలో కూడా ఊహించని నష్టాలు తీసుకొచ్చింది.
ఇంటిలిజెంట్: సాయి ధరమ్ తేజ్ ఇలాంటి ఓ సినిమా చేసాడని కూడా చాలా మందికి తెలియదు. వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫుల్ రన్‌లో కేవలం 3 కోట్లు మాత్రమే తీసుకొచ్చి.. దాదాపు 90 శాతం నష్టాలు మిగిల్చింది డిస్ట్రిబ్యూటర్లకు. 

More Related Stories