గృహలక్ష్మి సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్..Gruha Lakshmi Hari Krishna
2020-06-27 00:35:12

చాలా రోజుల తర్వాత మళ్లీ షూటింగులు మొదలయ్యాయి. అయితే ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలబడేలా కనిపించడం లేదు. ఎందుకంటే కరోనా వైరస్ మెల్లమెల్లగా బుల్లితెరపై కూడా పాకుతుంది. ఇప్పటికే సూర్యకాంతం సీరియల్ నటుడు ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ రావడంతో అతడిని కలిసిన వాళ్ళు అందరూ వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో సీరియల్ నటుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మాటీవీలో వచ్చే 'గృహలక్ష్మి' సీరియల్‌లో నటిస్తున్న హరికృష్ణ అనే నటుడికి కూడా కరోనా సోకింది. దీంతో ఆయన క్వారంటైన్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. విషయం తెలిసిన వెంటనే ఎపిసోడ్ షూటింగ్ రద్దు చేసింది సీరియల్ యూనిట్. హరికృష్ణతో కలిసిమెలిసి ఉన్న వాళ్ళందరికీ కరోనా టెస్టులు చేయించుకోవాలని యూనిట్ చెబుతోంది. మరోవైపు ప్రభాకర్ కారణంగా సూర్యకాంతం సీరియల్ నటీనటులకు కరోనా పరీక్షలు చేసుకుని ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. 

ఇప్పటికే సీరియళ్లకు వచ్చే యాడ్స్ తగ్గిపోయాయని.. పారితోషికంలో కూడా భారీ కోతలు విధిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జరుగుతున్న షూటింగ్ కూడా ఇలా కరోనా కారణంగా ఆగిపోవడంతో మరింత దిగాలు పడుతున్నారు సీరియల్ నిర్మాతలు. ఇక సినిమాల విషయానికొస్తే మన హీరోలు అసలు బయటికి రావడం లేదు. ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందాం అంటున్నారు. పొరపాటున ఈ యూనిట్లో ఒక్కరికి వైరస్ సోకిన కూడా అదే అందరికీ పాకుతుంది కాబట్టి ఇప్పట్లో షూటింగ్స్ లేకపోవడమే మంచిది అంటున్నారు మన హీరోలు. అప్పటికీ కొందరు ధైర్యం చేసి షూటింగులు చేస్తున్నారు. కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకొని తమ పని చేసుకుంటున్నారు. 

More Related Stories