బాలయ్య తరువాతి సినిమా అదేనట Balakrishna
2020-06-30 16:52:38

సూపర్ హిట్ సినిమాల్ దర్శకుడు బి.గోపాల్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసిన 'ఆరడుగుల బుల్లెట్' సినిమా కూడా చాలా కాలం విడుదల కాలేదు, ఇప్పుడు ఆ సినిమాని ఒటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఆయన ప్రస్తుతం బాలయ్యతో ఒక సినిమా చేస్తున్నాడనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. ఈ విషయం మీద అధికారిక ప్రకటన లేకున్నా ఈ కాంబినేషన్ సినిమా ఉంటుందని అయితే అటు అభిమానులు ఇటు కామన్ ఆడియన్స్ ఇద్దరూ ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతానికి బాలయ్య బోయపాటి సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆపారు. షూట్స్ మళ్ళీ మొదలు అయ్యాక ఈ సినిమాని వీలయినంత త్వరగా పూర్తి చేసి బీ గోపాల్ సినిమా లైన్ లో పెట్టేసే ఆలోచనలో ఉన్నాడట బాలయ్య.  ఈ సినిమాలో బాలయ్య రైతు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుందని అంటున్నారు. రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ రాసిచ్చారని అంటున్నారు. నిజానికి ఈ సినిమా క్యాన్సల్ అయినట్టు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలు అవాస్తవం అని తెలుస్తోంది. ఈ సినిమా తరువాత బాలయ్య పూరితో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

More Related Stories