ఎన్టీఆర్ కోసం విలన్ గా మారుతున్న మంచు మనోజ్ Manchu manoj
2020-07-04 12:53:31

తెలుగు హీరోలలో కొందరు జాన్ జిగిరీ ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకునే పేర్లు ఎన్టీఆర్‌, మంచు మనోజ్‌ లు. వీరి కుటుంబాలు చిన్నప్పటి నుండీ సన్నిహితంగా మేలిగేవి సో వీరు కూడా బాగా క్లోజ్. మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో మేజర్ చంద్రకాంత్‌ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్‌‌కు జూనియర్ తన తాతతో పాటు వచ్చేవారట. అప్పుడే అదే షూట్ కు వచ్చే మనోజ్‌ కు జూనియర్‌కు మధ్య పరిచయం ఏర్పడగా ఆ తరువాత నుండి వారి స్నేహం బలపడింది. ఈ ఇద్దరి పుట్టినరోజులు కూడా ఒకే రోజు కావడం విశేషం. మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ బద్ధ శత్రువులుగా మారబోతున్నారని అంటున్నారు. అయితే ఇది నిజ జీవితంలో కాదు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాలో నట. 

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌లో ఉండగానే ఆయన త్రివిక్రమ్‌తో మరో సినిమాని ఫైనల్ చేశారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో నటించే నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్‌. హీరోయిన్స్‌గా జాన్వీ కపూర్, పూజా హెగ్డేలను పరిశీలిస్తున్న త్రివిక్రమ్ విలన్‌ గా మనోజ్‌ను తీసుకోవాలని భావిస్తున్నాడట. అందులో భాగంగా దీనికి సంబంధించి మనోజ్‌ ని సంప్రదించగా అసలే హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న ఆయన మిత్రుడు సినిమాలో విలన్‌ గా నటించడానికి సరే అనడంతో అంతా సెట్ అయినట్టే నని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హల్ చల్ చేస్తోన్న ఈ వార్త ఎంత వరకూ నిజమో చూడాలి. మనోజ్ ప్రస్తుతం 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మనోజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమాగా తెరకేక్కుతోంది.  

More Related Stories