పవన్ కోసమే చరణ్ తో సినిమా Pawan Kalyan
2020-07-08 01:33:26

మెగా అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కాంబినేషన్ వర్కవుట్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రెండో సినిమా చేస్తున్న  త్రివిక్రమ్..లాక్ డౌన్ ఖాళీ టైమ్ లో రామ్ చరణ్ కోసం ఓ కథను సిద్దం చేశాడని అంటున్నారు. రామ్ చరణ్ తో ఈ కథకి సంబంధించిన చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.  ఎన్టీఆర్ చిత్రం కథ పూర్తవడంతో ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథను పూర్తి చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడట. ఎన్టీఆర్ తో చేసే సినిమా కంప్లీట్ చేసిన వెంటనే రామ్ చరణ్ సినిమాని పట్టాలేక్కించబోతున్నాడట త్రివిక్రమ్. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ నిర్మించబోతున్నాడట. చాలా రోజులుగా పవన్ చరణ్ కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంబందించిన తాజా అయితే తాజా అప్డేట్ ఏంటంటే పవన్ కోసమే త్రివిక్రమ్ చరణ్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారట. పవన్ కల్యాణ్ బ్యానర్ లో చరణ్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఈ సినిమా రానుందని అంటున్నారు.  

More Related Stories