వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా...అంకితను అప్సర చేసేశాడు RGV
2020-07-08 14:50:46

రామ్ గోపాల్ వర్మ మామూలోడు కాదు. ఆయన ఎప్పుడేం చేస్తాడనేది ఎవరికీ అర్థం కాదు. అసలు ఈయన ఎప్పుడెలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. అమ్మాయిల విషయంలో చాలా బోల్డ్ గా ఉంటాడు వర్మ. ఇన్ని రోజులు చాలా మందిని అన డ్రీమ్ గాల్స్ గా చెప్పుకున్న వర్మ ఇప్పుడు ఆ లిస్టు లో కొత్తగా మరో అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆమె కోసం తాను ఏదైనా చేయడానికి సిద్ధమే అంటున్నాడు వర్మ. ఆమె పేరు అప్సర రాణి అని, పేరుకు తగ్గట్లే అప్సరలా ఉందని ఆమెకి మార్కెటింగ్ చేసే పనిలో పడ్డాడు వర్మ. ప్రస్తుతం ఆమె వర్మ తరపున థ్రిల్లర్ అనే సినిమా చేస్తోంది. 

తాజాగా విడుదలైన స్టిల్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఎందుకో తెలియదు కానీ ఈ అమ్మాయిపై వర్మ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని జనాల్లో క్రియేట్ చేసిన వర్మ. చిన్న లాజిక్ మిస్సయ్యాడు. ఈమెను ఒక కొత్త ఫేస్ అంటూ, పరిచయం చేయడానికి వర్మ ట్రై చేస్తున్నాడు. కానీ నిజానికి ఈ భామ అసలు పేరు అంకిత మహారాణా. గత ఏడాది రిలీజ్ అయిన 4 లెటర్స్ , ఉల్లాల్లా ఉల్లాల్లా  అనే రెండు తెలుగు సినిమాల్లో నటించింది. అప్పట్లో నటుడు సత్య ప్రకాష్ తెరకెక్కించిన ఉల్లాల్లా ఉల్లాల్లా సినిమా ఆడియో ఫంక్షన్ లో ఈ అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యానని చెప్పాడు. ఇక ఆమెను జనం మర్చిపోయారు. దీంతో అమెను ఇప్పుడు పేరు మార్చు 'అప్సరా రాణి' అంటూ దించాడు. అయితే వర్మను ఫాలో అయ్యే కొందరు ఈ విషయన్ని పట్టేశారు. అది చూసిన నెటిజన్లు ఔరా వర్మా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.  

More Related Stories