కిడ్నీలు అమ్మి కరెంట్ బిల్ కడతానంటున్న నటుడు..Arshad Warsi
2020-07-08 08:00:38

కోరనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ సందర్భంగా చాలా మంది జీవితాలు అతలాకుతలం అయిపోయాయి. ముఖ్యంగా లాక్ డౌన్ తర్వాత వస్తున్న కరెంట్ బిల్స్ మాత్రం చాలా మందికి షాక్ ఇస్తున్నాయి. అసలు ఆ బిల్స్ చూసిన తర్వాత అంతా కళ్లు తేలేస్తున్నారు. కొందరికి ఏకంగా లక్షల్లోనే బిల్స్ వస్తున్నాయి. చాలా మంది తమకు వచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్స్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటుడు కూడా ఇదే చేసాడు. తనకు వచ్చిన బిల్ చూసి షాక్ అయ్యాడు ఈయన. అంతేకాదు ఈ బిల్ కట్టడానికి తాను ఏకంగా కిడ్నీలు అమ్ముకుంటానని చమత్కరించాడు. ఆయనెవరో కాదు అర్షద్ వార్షీ. మున్నాభాయ్ సిరీస్ తో ఈయన సర్క్యూట్ గా బాగా ఫేమస్ అయ్యాడు. 

ఇప్పటికే కార్తీక, తాప్సీ, సందీప్ కిషన్‌, హ్యుమా ఖురేషి, సోహ అలీ ఖాన్, డినో మోరియా లాంటి స్టార్స్ చాలా మంది తమకు వచ్చిన కరెంట్ బిల్స్ గురించి పోస్ట్ చేసారు. ఇప్పుడు అర్షద్ వార్షీ కూడా ఇదే చేసాడు. తన ఇంటికి ఏకంగా 1,03,564 కరెంట్ బిల్ వచ్చిందని.. అది చూసి తాను షాక్ అయ్యానని చెప్పాడు. తాను వేసిన పెయింటింగ్స్ ఎవరైనా కొంటే ఆ వచ్చిన డబ్బుతో కరెంట్ బిల్ కడతానంటున్నాడు ఈయన. ఆ తర్వాతి నెల బిల్ చెల్లించేందుకు ఆ రెండు కిడ్నీలని అమ్మేందుకు సిద్ధమవుతున్నా అని చమత్కరించాడు ఈ నటుడు. మొత్తానికి ఈయన ట్వీట్ లో చమత్కారం కనిపిస్తున్నా సామాన్యులను ఎలా పీల్చి పిప్పి చేస్తున్నారనేది అర్థమవుతుంది. 

More Related Stories