సుశాంత్ విషయంలో నేనే తప్పు చేయలేదంటున్న భన్సాలీ.. Sanjay Leela Bhansali
2020-07-08 23:32:26

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి మూడు వారాలు గడిచినా కూడా ఇప్పటికీ ఈయన మరణంపై అనుమానాలు ఆగడం లేదు. ముఖ్యంగా యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జూన్ 14న తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని మరణించాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఈయన మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈయన మృతి తట్టుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇక సుశాంత్ మృతిపై ముంబై పోలీసుల విచారణ కూడా వేగంగానే కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 30 మందిని ఈ కేసులో విచారించారు ముంబై పోలీసులు. నిన్నటికి నిన్న కూడా బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీని విచారించారు పోలీసులు. 

ఈ సందర్భంగా ఆయన కూడా కీలకమైన విషయాలు తెలిపాడు. భన్సాలీని దాదాపు పోలీసులు 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. వీటన్నింటికీ ఆయన కూడా దాచుకోకుండా సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. భన్సాలీ తెరకెక్కించిన రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ లాంటి సినిమాల్లో ముందు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ను హీరోగా తీసుకుని ఆ తర్వాత రణ్ వీర్ సింగ్ వైపు వెళ్లాడని ప్రచారం బాలీవుడ్ లో ఉంది. 

ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళడానికి ఇది కూడా ఓ కారణంఅంటూ భన్సాలీ పై అభియోగాలు వచ్చాయి. దీనిపై కూడా పోలీసులు భన్సాలీని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. అసలు తాను సుశాంత్ కు అవకాశాలు రాకుండా చేశాననడంలో నిజం లేదని వారించాడు భన్సాలీ.  సుశాంత్ తో చివరిసారిగా తాను 2016లో మాట్లాడాను అంతే.. అప్పట్నుంచి చనిపోయే వరకు కూడా కలవలేదని చెప్పుకొచ్చాడు ఈయన. ఈ కేసులో పోలీసులు మరికొందర్ని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. 

More Related Stories