చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా ఎంత వరకు వచ్చిందంటే..Chiranjeevi Trivikram
2020-07-09 07:37:27

ఇంతకీ చిరంజీవి ఎన్ని సినిమాలు చేస్తున్నాడు.. సగటు సినిమా ప్రేక్షకుడికి వస్తున్న అనుమానం ఇదే. పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అన్నయ్య ఖైదీ నెంబర్ 150తో ఇంకా ఉన్నాన‌ని గుర్తు చేసాడు. గతేడాది సైరాతో తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించాడు మెగాస్టార్. ఈ సినిమా సెట్స్ పై ఉన్నపుడే మరో రెండు సినిమాలు క‌మిటయ్యాడు చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరు. ఈ సినిమా షూటింగ్ కూడా సగం పూర్తైపోయింది. ఈ సినిమా 2020లోనే విడుదల కానుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని తన కొణిదెల బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు. కొరటాల సినిమా తర్వాత లూసీఫర్ రీమేక్ కూడా సిద్ధంగానే ఉంది. సాహో సుజీత్ దీనికి దర్శకుడు. ఈ సినిమా తర్వాత కూడా మూడు నాలుగు కథలు విన్నాడు మెగాస్టార్. 

ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందని తెలుస్తుంది. ఈయ‌న‌తో చిరంజీవి 153వ సినిమా ఉండబోతుంది. ఈ విషయం చెప్పింది కూడా మరెవరో కాదు.. స్వయంగా మెగాస్టార్. తమ కాంబినేషన్ కలిపింది రామ్ చరణ్ అంటూ అభిమానుల ముందు అసలు విషయం చెప్పాడు చిరంజీవి. అందుకే తనయుడికి థాంక్స్ కూడా చెప్పాడు చిరు. తనకు మంచి దర్శకున్ని త‌న‌యుడు ఇచ్చాడ‌ని మురిసిపోయాడు ఈ హీరో. 2021 చివర్లో త్రివిక్రమ్- చిరంజీవి సినిమా ప‌ట్టాలెక్కే అవకాశం ఉంది. బన్నీ అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈయన త్వరలోనే ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. 

ఆ తర్వాత చిరు సినిమాపై దృష్టి పెట్టనున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గతంలో మెగాస్టార్ నటించిన జై చిరంజీవ సినిమాకు కథ, మాటలు అందించాడు మాటల మాంత్రికుడు. ఇక ఇప్పుడు తెరకెక్కించబోయే సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. చిరు కామెడీ టైమింగ్ పూర్తిగా వాడుకునే సినిమా ఇది అవుతుందని ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు లూసీఫర్ రీమేక్ కూడా చేస్తున్నాడు మెగాస్టార్. మొత్తానికి ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు చిరంజీవి. 

More Related Stories