రీమేక్ మీద ఫోకస్ పెట్టిన నాగార్జున  Nagarjuna
2020-07-10 16:43:16

‘మన్మథుడు 2’ సినిమా లాంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ అనే కాప్ ఓరిఎంటెడ్  మూవీకి కమిట్ అయ్యాడు. మహర్షి సినిమాకి రచయితగా పని చేసిన సాల్మన్ అనే వ్యక్తిని ఈ సినిమా సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. విజయ వర్మ అనే ఒక ఎన్ఏఐ ఆఫీసర్ జీవిత కథనే సినిమాగా మలుస్తున్న ఈ సినిమా షూట్ కూడా దాదాపుగా కంప్లీట్ కావొచ్చింది. ఇంతలో కరోనా రావడంతో ఆ సినిమా షూట్ చివర్లో ఆగింది. ఇక ఇప్పుడు నాగ్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ని త్వరలోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. 

ఈ సినిమాని  అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఆ విషయం పక్కన పెడితే ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడని అంటున్నారు. ఇది ఒక ఇన్విస్టిగేటివ్ జానర్ సినిమా అని ప్రచారం కూడా జరిగింది. అయితే అందుతున్న సమాచారం మేరకు బాలీవుడ్ లో విజయవంతమైన ‘రైడ్‌’ని తెలుగులో రీమేక్‌ చేయడంపై నాగార్జున ఎప్పట్నుంచో ఆసక్తి చూపుతున్నారు. ముందు బంగార్రాజు అనంతరం ప్రవీణ్‌ తో సినిమా ఆ తర్వాత ‘రైడ్‌’ రీమేక్‌ పట్టాలెక్కే అవకాశాలున్నాయని అంటున్నారు.  

More Related Stories