సరిలేరు నీకెవ్వరుతో బాగా హర్ట్ అయిన బండ్ల గణేష్..Bandla Ganesh
2020-07-12 23:02:34

కొన్నేళ్లుగా సినిమాలు మానేసి హాయిగా నిర్మాతగా.. వ్యాపార వేత్తగా బిజీ అయిపోయాడు బండ్ల గణేష్. టెంపర్ తర్వాత ఎందుకో కానీ సినిమాలు కూడా నిర్మించడం మానేసాడు. ఈయన పూర్తిగా కొన్ని రోజుల నుంచి ఫౌల్ట్రీ రంగంలోనే ఉన్నాడు. చాలా ఏళ్ళ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ నటుడిగా వచ్చాడు. ఈ కారెక్టర్ చేస్తున్నాడంటే చాలా అంచనాలు కూడా ఉన్నాయి. పైగా దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ కారెక్టర్ కోసం ప్రత్యేకంగా బండ్ల గణేష్ ను తీసుకున్నాడు. ఎంతోమంది నటులుండగా కావాలనే బండ్ల గణేష్ ను ఎంచుకుని మరీ తన సినిమాలో నటించేలా చేసాడు ఈ కుర్ర దర్శకుడు. దాంతో తన కారెక్టర్ ఓ రేంజ్ లో ఉంటుందని నమ్మి చేసాడు బండ్ల గణేష్ కూడా. కానీ తీరా సినిమా విడుదలైన తర్వాత అది పెద్ద బిస్కెట్ అయిపోయింది. 

అసలు అలాంటి కారెక్టర్ ఎందుకు చేసాడబ్బా అంటూ బండ్ల గణేష్ ను కొందరు విమర్శించారు కూడా. ఈ విషయంలో ఈ నటుడు కమ్ నిర్మాత కూడా బాగానే హర్ట్ అయ్యాడు. అనవసరంగా అనిల్ రావిపూడిని నమ్మి తప్పు చేసానని.. మోసపోయానని చెప్పాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాపై మండి పడ్డాడు ఈయన. ఇకపై అలాంటి పాత్రలు వస్తే నటన మానేస్తాను కానీ అలాంటివి మాత్రం చేయనంటూ శపథం చేసాడు బండ్ల గణేష్. ఈయన మాటలను బట్టి చూస్తుంటే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు బండ్ల గణేష్ మనసును ఎంత గాయపరిచిందో అర్థమవుతుంది. కాగా ఈ మధ్యే కరోనా పాజిటివ్ వస్తే దాన్నుంచి ధైర్యంగా బయటపడ్డాడు బండ్ల గణేష్.

More Related Stories