సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ చంపేసిందా..Sushant Singh
2020-07-12 23:17:27

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్  మరణంపై రోజుకొక వార్త బయటకు వస్తుంది. అసలు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా చంపేశారా అంటూ  ఎప్పటికప్పుడు అనుమానాలు వస్తూనే ఉన్నాయి.  ఇప్పటికే వైద్య బృందంతో పాటు పోలీసులు కూడా  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు.  ఉరి వేసుకోవడం వల్లే ఆయన చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఇచ్చారు. కానీ అతని అభిమానులు మాత్రం  సుశాంత్ మరణం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు చనిపోయేంత బాధలు లేవు అంటూ సన్నిహితులు కూడా చెబుతున్న తరుణంలో  కచ్చితంగా సుశాంత్ ను హత్య చేశారు అంటూ మరికొందరు వాదిస్తున్నారు. 

తాజాగా మాజీ 'రా' అధికారి ఎన్‌కె సూద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దావూద్ గ్యాంగ్ సుశాంత్ ను హత్య చేసినట్లు ఈయన చెప్పడం సంచలనం రేపుతుంది. దావూద్ ఇబ్రహీం ముఠా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఫోన్ ద్వారా బెదిరించిందని.. దీంతో మానసిక సంఘర్షణకు లోనయ్యాడని ఎన్‌కె సూద్ చెప్పాడు. దావూద్ ముఠా మాత్రమే కాదు.. సుశాంత్ సన్నిహితులు కూడా ఈ కుట్రలో పాల్గొన్నారని ఆయన కామెంట్ చేశాడు. సుశాంత్ ఆత్మహత్యకు ఒక రోజు ముందు సిసిటివి కెమెరాలు ఆగిపోయాయని ఆయన ఆరోపించాడు. అప్పటి వరకు పనిచేసిన కెమెరాలు అదేరోజు ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నిస్తున్నాడు. 

అంతేకాకుండా దావూద్ ముఠా నుంచి వచ్చే బెదిరింపులను తప్పించుకోడానికే ఒకే నెలలో సుశాంత్ 50 సిమ్ కార్డులను మార్చాడని ఆయన చెబుతున్నాడు. రాత్రులు ఇంటికి కూడా రాకుండా తన కారులో నిద్రించేవాడని సూద్ సంచలన విషయాలు వెల్లడించాడు. సుశాంత్ ఫ్రెండ్ కం మేనేజర్ సందీప్ సింగ్ తో పాటు అనేక మంది బాలీవుడ్ పెద్దల ఈ కుట్రలో భాగస్వాములని మాజీ రా అధికారి ఆరోపించారు. మరి ఈయన చేసిన వ్యాఖ్యలు శాంతి కేసును ఎటువైపు తిప్పుతాయో చూడాలి. 

More Related Stories