స్టార్ హీరోల సినిమాలు ఓటిటిలో విడుదలైతే కొంప కొల్లేరే..Tollywood
2020-07-13 19:22:20

ఈ మధ్య ఓటిటి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ సినిమాలు విడుదల చేయడాన్ని ప్రజ్టేజియస్ గా తీసుకుంటున్నారు హీరోలు. ఒకేసారి థియేటర్స్ కాకుండా నేరుగా డిజిటల్లో సినిమాలు విడుదల చేస్తే కచ్చితంగా తమ ఇమేజ్ పడిపోయినట్లే అని భావిస్తున్నారు. ఈ మధ్య చాలా సినిమాలు నేరుగా ఓటిటిలో విడుదలవుతున్నాయని వార్తలు వచ్చాయి. అందులో నాని నటించిన వి సినిమా కూడా ఉంది. దాంతో పాటు అనుష్క నిశ్శబ్ధం ఉంది. అయితే ఈ రెండు సినిమాలతో పాటు మరిన్ని సినిమాలు కూడా నేరుగా ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే ఈ తరుణంలో ఇండస్ట్రీలో మాత్రం మరోలా వార్తలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఈ సినిమాలే కాదు.. క్రేజీ సినిమాలేవీ కూడా ఓటిటిలో విడుదల కావని స్పష్టమవుతుంది. 

ఎందుకంటే థియేటర్స్ లో రిలీజ్ అయితే దగ్గరుండి ప్రమోషన్స్ చేసే స్టార్స్.. డిజిటల్లో రిలీజ్ చేస్తే మాత్రం అలా ఉండదు. కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వరు.. పైగా తమ ఇమేజ్ పడిపోయిందని భావిస్తారు. నిర్మాతలు కూడా దీనికి ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా దిల్ రాజు, సురేష్ బాబు, అశ్వీని దత్, అల్లు అరవింద్ లాంటి బడా నిర్మాతలు కూడా ఓటిటి విడుదలకు ఆసక్తి చూపించడం లేదు. అలా చేస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని.. ఫ్యూచర్ లో థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఓటిటిపైనే ఆడియన్స్ ఆధారపడతారని భావిస్తున్నారు. అలా జరిగితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఓటిటి వద్దంటున్నారు బడా నిర్మాతలు. మరోవైపు బాలీవుడ్ లో మాత్రం అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలను కూడా ఓటిటిలో విడుదల చేస్తున్నారు. తెలుగులో మాత్రం స్టార్ హీరోల సినిమాలు ఆన్ లైన్ రిలీజ్ చేస్తే కొంప కొల్లేరు అవుతుందంటున్నారు నిర్మాతలు. 

More Related Stories