వర్మ పవర్ స్టార్‌లో బండ్ల గణేష్ పాత్ర నవ్వించి చంపేస్తుందట.. Bandla Ganesh
2020-07-13 12:32:37

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పవర్ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. అదెప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ వీర వేగంగా షూటింగ్ మాత్రం జరుపుకుంటుంది. అసలు ఎప్పుడు మొదలు పెడుతున్నాడో.. ఎప్పుడు పూర్తి చేస్తున్నాడో కూడా తెలియకుండా వర్మ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ కూడా వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలవుతున్న స్టిల్స్ సినిమాపై ఆసక్తిని అయితే పెంచేస్తున్నాయి. వర్మ కచ్చితంగా సోది తీస్తాడని ఓ వర్గం సినిమాను తీసి పారేస్తున్నా కూడా సెటైర్లు వేయడంలో మనోడు దిట్ట అని మరో వర్గం నమ్ముతుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ సినిమాలో బండ్ల గణేష్ పాత్ర కూడా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వీర విధేయుడిగా బండ్లకు పేరుంది. 

ఆయన తానా అంటే ఈయన తందాన అంటాడు. ఇంకా మాట్లాడితే దేవుడు లేడు.. ఉన్న దేవుడు పవన్ ఒక్కడే అంటాడు బండ్ల గణేష్. ఈ మధ్యే తన దేవుడి నుంచి ఇంకా పిలుపు రాలేదంటూ మీడియా ముందు చెప్పుకొచ్చాడు ఈ కమెడియన్ కమ్ నిర్మాత. ఇదిలా ఉంటే ఇప్పుడు వర్మ చేస్తున్న పవర్ స్టార్ సినిమాలో బండ్ల గణేష్ పాత్ర హిలేరియస్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఎప్పుడూ భజన చేస్తూ.. పొగుడుతూ ఉండే సెటైరికల్ పాత్ర ఇది. దీన్ని సినిమాలో కాసింత కాన్సట్రేట్ చేసి తీర్చి దిద్దుతున్నాడు వర్మ. మరి పవర్ స్టార్ సినిమాలో బండ్ల పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలిక. 

More Related Stories