ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..thalapathy vijay
2020-07-14 14:49:51

తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రజనీకాంత్ ను కూడా బీట్ చేసాడు ఈయన. వరస విజయాలతో విజయ్ ఇమేజ్ ఇప్పుడు ఆకాశానికి చేరిపోయింది. ఈయన సినిమా విడుదలైతే కచ్చితంగా 300 కోట్లు వసూలు చేస్తుంది. గత మూడు నాలుగేళ్లుగా విజయ్ చేస్తున్న సినిమాలు.. ఆయన ఎంచుకుంటున్న కథలు అభిమానులకు మరింత చేరువయ్యేలా చేస్తున్నాయి. దానికితోడు రాజకీయంగా కూడా విజయ్ పలుకుబడి బాగా పెరుగుతోంది. ఆయన కోసం కొన్ని రాజకీయ పార్టీలు కూడా ట్రై చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ అది నిజం కాదు.. కేవలం సినిమా కోసం మాత్రమే. ఇప్పటికే సర్కార్ సినిమాలో రాజకీయాలు చాలా చేశాడు విజయ్. ఇప్పుడు ఏకంగా శంకర్ సినిమాలో నటించబోతున్నాడని తెలుస్తుంది. 

20 ఏళ్ల కింద యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు సినిమా గుర్తుంది కదా.. దానికి ఇప్పుడు సీక్వెల్ చేయాలని చూస్తున్నాడు శంకర్. ఇప్పటికే రోబో సీక్వెల్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు భారతీయుడు 2 చేస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత ఒకే ఒక్కడు సీక్వెల్ చేయడానికి కథ సిద్ధం చేసుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఇందులో హీరోగా విజయ్ ని తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాట విజయ్ కంటే ఇమేజ్ ఎక్కువగా ఉన్న హీరో ఎవరూ లేరు. రాజకీయంగా ఏదైనా కథ చెప్పాలంటే విజయ్ పక్కా సరిపోతాడు. అందుకే తాను రాసుకున్న ఒకే ఒక్కడు సీక్వెల్ కు విజయ్ ను  ఒప్పించాలని చూస్తున్నాడు శంకర్. గతంలో ఈ కాంబినేషన్ లో స్నేహితుడు సినిమా వచ్చింది.

More Related Stories