బాలీవుడ్‌ హీరోయిన్ డ్రైవర్‌కు కరోనాSara Ali Khan
2020-07-15 01:36:16

బాలీవుడ్ పరిశ్రమకు ఇప్పుడు కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కోవిడ్ 19 వైరస్ సోకినట్టు నిర్ధారణైంది. నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబసభ్యుల్లో నలుగురికి కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో హీరోయిన్ సారా అలీ ఖాన్ కూడా చేరింది. తన డ్రైవర్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘తనతో పాటు మిగతా కుటుంబ సభ్యులు, ఇతర సిబ్బందికి కూడా కరోనా టెస్టులు జరిగాయని.. అదృష్టవశాత్తూ అందరికీ నెగిటివ్ వచ్చినట్లు పేర్కొంది. అలాగే మేమంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నాతో పాటు నా కుటుంబ సభ్యులందరి తరుపునా బీఎంసీకి కృతజ్ఞతలు తెలుపుతున్నా’.. అంటూ సారా అలీ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది.

More Related Stories