బాలకృష్ణ సినిమాలో సంజయ్ దత్‌ లేనట్టే...అందుకేనట Balakrishna
2020-07-15 08:48:14

నంద‌మూరి బాల‌కృష్ణ ప్రస్తుతం బోయ‌పాటితో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే బోయ‌పాటి తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకో నిజం ఎంతుందో తెలియదు కానీ ఈ సినిమా గురించిన కొన్ని పుకార్లు భీబత్సంగా హల్చల్ చేస్తున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో హీరో ఎంత బలంగా ఉంటాడో.. విలన్ కూడా అంతే బలంగా, పొగరుగా ఉంటాడు. అందుకే, ఆయన సినిమాల్లో హీరో పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయి.

ఈ బాల‌కృష్ణ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోను బోయపాటి విలన్‌గా పరిచయం చేయబోతున్నారని అంటున్నారు. ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు సంజయ్ దత్. బాల‌య్య‌కి విల‌న్‌గా బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్‌ని ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ని ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో భారీ బడ్జెట్‌ సినిమాలకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో బాలయ్య సినిమాని నిర్మిస్తున్న నిర్మాత మిర్యాల రవిందర్‌ రెడ్డి బడ్జెట్‌ ను తగ్గించుకుంటున్నాడట. సంజయ్‌ దత్‌ అయితే భారీగా పారితోషికం ఇవ్వాల్సి ఉంటుండటంతో ఆయనను పెట్టుకునే పరిస్థితుల్లో లేన్నట్టు చెబుతున్నారు. 

More Related Stories