అకిరా నందన్ ల్యాప్‌టాప్ ముందు సీరియస్‌గా ఏదో చేస్తున్నాడుగా.. Akira Nandan
2020-07-16 15:19:15

అకిరా నందన్.. ఈ పేరు వింటే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూస్తున్నారు. అకిరా నందన్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు కనిపిస్తూ ఉత్తేజ పరుస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈ కుర్రాడు. ప్రస్తుతం అకిరా నందన్ వయస్సు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఈయన ఫోకస్ అంతా ఇప్పుడు చదువుపైనే ఉంది. ఫ్యూచర్ లో సినిమాలు చేస్తాడో లేదో తెలియదు. ఇప్పుడు అయితే ఓ ఫోటో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ల్యాప్ టాప్ ముందు పెట్టుకుని కాలు మీద కాలేసుకుని అకిరా నందన్ ఏదో పని చేస్తున్నాడు. ఈ ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేణు దేశాయ్. ప్రస్తుతం వైరల్ అవుతుంది అకిరా నందన్ ఫోటో. ఆన్ లైన్ క్లాసులు కానీ అకిరా వింటున్నాడా ఏంటి అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఈయన ఎంట్రీ గురించి అమ్మ రేణు దేశాయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే 6 అడుగుల 4 అంగుళాలు పెరిగిపోయాడు ఈ కుర్రాడు.

మరో రెండు మూడేళ్లలో వరుణ్ తేజ్ ను కూడా మించిపోయేలా కనిపిస్తున్నాడు. దాంతో పవన్ వారసుడు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అంటూ నేరుగా రేణు దేశాయ్ ని ప్రశ్నించారు నెటిజన్లు. ఈ మధ్యే సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు ముచ్చటించి రేణు. ఈ క్రమంలోనే చాలా విషయాలపై స్పష్టత ఇచ్చింది ఈమె. మరీ ముఖ్యంగా అకీరా నందన్ సినిమాల్లో కి వస్తాడా రాడా అనే విషయంపై కూడా రేణు దేశాయ్ కుండ బద్దలు కొట్టేసింది. తన కొడుకు సినిమాలు చేస్తాడా చేయడా అనేది పూర్తిగా ఆయన నిర్ణయానికి వదిలేశాను అంటూ చెప్పుకొచ్చింది ఈ మాజీ హీరోయిన్. కుటుంబమంతా సినిమాల్లో ఉంది కాబట్టి తను కూడా హీరో అవ్వాలి అని ఎవరు అకీరాపై ఒత్తిడి తీసుకురాలేదని.. నటుడిగా మారతాడా లేదా అనేది పూర్తిగా అతడి స్వేచ్ఛకు వదిలేస్తున్నాను అంటూ చెప్పింది రేణు. తనకు నచ్చింది తాను చేస్తాడు కానీ ఖచ్చితంగా సినిమాల్లోకి వెళ్ళాలి అని ఒత్తిడి మాత్రం తీసుకురాను అని చెప్పింది. అయినా ప్రస్తుతం తన కొడుక్కి 16 ఏళ్ళు మాత్రమే అని.. ఇంకా చాలా సమయం ఉంది అంటూ సమాధానం ఇచ్చింది. మహేష్ బాబు సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట అని అడిగితే ఈ మధ్య కాలంలో నేను విన్న అతి పెద్ద జోక్ ఇదే అంటూ కొట్టిపారేసింది రేణు దేశాయ్. 

More Related Stories