అలీని టార్గెట్ చేసిన పవన్ అభిమానులు Pawan Kalyan
2020-07-16 18:59:39

టాలీవుడ్‌లో క‌మెడియ‌న్ అలీకి ఉన్న స్థానం ప్రత్యేకం అని చెప్పచ్చు. సినిమాల్లో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన హీరో స్థాయికి ఎదిగాడు. ఆయనకు ఇండస్ట్రీలో పాతుకు పోయిన దాదాపు అన్ని ఫ్యామిలీల వారితోనూ సంబంధాలున్నాయి. మరీ ముఖ్యంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అలీకి మ‌ధ్య మంచి స్నేహ బంధం ప్రతేయకమైంది. గత కొన్నేళ్లుగా సాగుతోన్న ఈ స్నేహానికి రాజాకీయం దెబ్బ వేసింది. పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక అలీ జగన్ పంచన చేరడం ఆ క్రమంలో పవన్ ను విమర్శించడంతో దెబ్బ పడింది.

ఆ మ‌ధ్య ప‌వ‌న్ తో స్నేహం గురించి మాట్లాడించగా పెద్దగా ఏమీ మారలేదని కేవల త‌న‌కు మామిడి ప‌ళ్లు రావ‌డం లేద‌ని అలీ వెల్లడించ‌డంతో అలీ ప‌వ‌న్ ని పెద్దగా పట్టించుకోవడం లేదని సంకేతాలు ఇచ్చినట్టయ్యింది. దీంతో పవన్ ఫ్యాన్స్ అలీని ఆడుకుంటున్నారు. అదీ కాక తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ను ఉద్దేశిస్తూ పెట్టినట్టు అలీ పెట్టిన పోస్ట్ పవన్ అభిమానులకి ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. `వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు.. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వు కి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు..` అని అలీ ట్వీట్ చేశారు. దీనికి పవన్ అభిమానులు అలీని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

More Related Stories