సినీ ఎంట్రీకి రెడీ అయిన రెహ్మాన్ కుమార్తె .. AR Rahman
2020-07-17 14:53:46

సినిమాల్లోకి వారసుల ఎంట్రీ పెద్ద వింత ఏమీ కాదు. కానీ సుశాంత్ మరణం తరువాత అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే సుశంత్ మరణంతో బాలీవుడ్ నెపోటిజంపై తీవ్ర విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న క్రమంలో మరో సెలబ్రిటీ కూతురు ఇండస్ట్రీకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆమె ఎవరో కాదు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూతురు. ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చెందుకు రెడీ అవుతోందని అంటున్నారు. నిజానికి రెహమాన్‌కి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. వారిలో రహిమా రెహమాన్ ఒకరు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతో కొంత జనానికి సుపరిచితమనే చెప్పాలి. అదీ కాక ఆమె ఇప్పటికే కొన్ని మ్యూజిక్ వీడియోలు చేసింది. ఇప్పుడు నటనలో శిక్షణ తీసుకునేందుకు రెడీగా ఉందని చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో బాలీవుడ్ తెర‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదేమీ అంత ఈజీగా నమ్మదగిన విషయం కాదు. దీనికి రెహమాన్ లేదా ఆయన కూతురు క్లారిఏ ఇస్తే తప్ప నమ్మలేం.

More Related Stories