ఛార్మి ఇంట్లో విషాదం.. మిస్ అవుతున్నా అంటూ ఎమోషనల్..Charmi Aunty death
2020-07-18 01:29:43

టాలీవుడ్ హీరోయిన్ కమ్ నిర్మాత ఛార్మి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె అత్త మరణించింది. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంది ఛార్మి. దాంతో పాటే చాలా ఎమోషనల్ లెటర్ కూడా రాసింది. తన అత్తతో కలిసున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇక మీరు లేరు అనే మాటే వినలేకపోతున్నా.. కానీ జీవితంలో జరిగేది జరగక మానదు అంటూ వేదాంతం మాట్లాడింది ఛార్మి. ఒక్కరోజు కిందే మీతో వీడియో కాల్ మాట్లాడాను.. అంతలోనే మీరు వెళ్లిపోయారు.. ఇదే చివరికి అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదంటూ రాసుకొచ్చింది ఛార్మి. 

మీరు లేరని తెలిసి మాటలు రావడం లేదు.. పైన స్వర్గంలో కూడా నీకు నచ్చినట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటావని అనుకుంటున్నానంటూ ట్వీట్ చేసింది ఈమె. పైన ఉన్న అప్పితో కలిసి ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది ఛార్మి. నిన్ను, నీ చిరునవ్వును మిస్ అవుతున్నా.. నా ప్రియమైన ఆంటీ నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అంటూ లేఖ ముగించింది ఛార్మి. మీరు లేరన్న వార్తతో నాకు కన్నీరు ఆగడం లేదంటూ చెప్పింది ఛార్మి. 

More Related Stories