ప్రభాస్ తో దీపికా....సీరియస్ అవుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్ prabhas
2020-07-21 01:01:45

బాహుబలి, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అత్యంత క్రేజ్‌ ఉన్న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అంటే అతిశయోక్తి కాదేమో. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా ఈ బాహుబలి సిరీస్ రిలీజ్ కావడంతో ప్రభాస్ ఇమేజ్ హాలివుడ్ స్థాయికి చేరింది. అయితే ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి సాహో సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ నిర్మాణ విలువలతో రూపొందించినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం అది నిలవకేకపోయింది. అయితే ఇప్పుడు ఆయన జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో వింటేజ్ స్టైల్‌ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అశ్వినీ దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు. 

సైన్స్‌ ఫిక్షన్‌ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోన్నది. ఈ ఏడాది చివరలో సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నా రాధే శ్యామ్ పూర్తి కావడం మీదే ఇది ఆధార పడి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన  దీపికా పదుకొన్ కథానాయికగా నటించనున్నట్లు నిన్న అధికారికంగా వైజయంతీ మూవీస్ ప్రకటించింది కూడా. అయితే ఈ విషయం మీద దీపికా స్పందించింది కూడా వైజయంతీ మూవీస్ ప్రకటన షేర్ చేస్తూ థ్రిల్ కి మించిన ఫీలింగ్ ఉందని, మేము నమ్మిన దానిని మొదలు పెట్టేందుకు ఇంకా ఆగలేకున్నామని ఆమె పేర్కొంది. అయితే ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసిన స్టోరీలు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది. అదేంటంటే ప్రభాస్ కి దీపికాతో నటించడం కల అని అది ఈ సినిమాతో తీరుతుందని దీపికా ఫ్యాన్స్ అకౌంట్ ఒకటి షేర్ చేయగా దానిని దీపికా షేర్ చేసింది. ఇదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్  ఆగ్రహానికి కారణం అయింది. 

More Related Stories