దటీజ్ బాలయ్య....అరుదైన విషయం షేర్ చేసిన వినాయక్balakrishna
2020-07-26 16:25:19

డైరెక్టర్ వి వి వినాయక్ తాజాగా షేర్ చేసిన ఓ విషయం బాలయ్య గొప్పతనాన్ని తెలిపింది. నిజానికి బాలకృష్ణ ఇప్పుడు బసవతరరకం హాస్పిటల్ చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో బాలకృష్ణ వినాయక్ కు కరోనా వైరస్ సోకకుండా కాపాడే మెడిసిన్ అందజేశారట. బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ లో రోగులకు కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్ పంచారట. అలాగే 24 క్రాఫ్ట్స్ లోని అందరు సాంకేతిక నిపుణలకు బాల్లయ్య వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందని వారితో పాటు వి వి వినాయక్ కి కూడా ఆయన ఈ ఇమ్మ్యూనిటీ బూస్టర్స్ ను ప్రత్యేకంగా పంపించారట. ఈ విషయాన్ని చెబుతూ వి వి వినాయక్ సంతోషం వ్యక్తం చేశారు. 

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో చెన్నకేశవ రెడ్డి అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. ఆ మూవీ విడుదలై దాదాపు 18ఏళ్ళు అవుతుంది. కానీ వివి వినాయక్ బాలయ్యతో మళ్ళీ మూవీ చేయలేదు. ఇక ఆయన హీరోగా ఇప్పుడు శీనయ్య అనే సినిమా తెరేకక్కుతోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో ఎప్పటికి రిలీజ్ అవుతుంతో కూడా తెలీని పరిస్థితి. 

More Related Stories