శెబాష్ సోనూ...మాటిచ్చాడు, నిలబెట్టుకున్నాడుSonu Sood.jpg
2020-07-27 06:31:04

కరోనా కారణంగా చిత్తూరు జిల్లాలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పొలాల్లో పని చేయటానికి కూలీలు సైతం దొరక్కుండా పోయారు. ఒకవేళ దొరికినా వారికి కూలీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది రైతులకు. జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలు మాత్రం రైతుల్లో ఆశలు రేకెత్తించాయి. ప్రస్తుత సమయంలో ట్రాక్టర్ కొనే స్థోమత లేకపోవడంతో  ఓ రైతు తన కన్న బిడ్డలనే పొలం దున్నడానికి వినియోగించాడు. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలానికి చెందిన నాగేశ్వరరావు అనే  రైతు టమాటా మొక్కలు నాటటం కోసం తన ఇద్దరు కూతుళ్లను నాగలికి ఎద్దుల్లాగా మార్చేశాడు. భార్యతో కలిసి పొలం దున్నాడు.

 నాగేశ్వరరావుకు మదనపల్లెలో టీ, పాల షాపు ఉండేది. ఐతే కరోనా లాక్‌డౌన్‌తో మొత్తం వ్యాపారం కుదేలైంది. బతుకు బండి సాగించడానికి పట్టణం వదిలి పల్లెటూరుకు వచ్చాడు నాగేశ్వరరావు. తెలిసిన వారికి చెందిన పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడానికి సిద్దమయ్యాడు. కరోనా వల్ల సంపాదించిన కాస్త డబ్బు ఖాళీ అయిపోయింది. పొలం దున్నటానికి ఎద్దులు...ట్రాక్టర్‌ను సమకూర్చుకునే అవకాశం లేకుండా పోయిందని దిగాలు పడ్డాడు. తండ్రి బాధను అర్దం చేసుకున్న ఇద్దరు కూతుళ్లు ఆయనకు అండగా నిలిచారు. తమ వంతుగా పొలం దున్నడానికి సాయపడ్డారు.

అయితే అలా దున్నుతున్నప్పుడు ఎవరో తీసిన వీడియో వైరల్ గా మారింది. దీంతో లాక్ డౌన్ తరువాత ఏర్పడిన తరువత ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించి రియల్‌ హీరో అనిపించుకుంటున్న నటుడు సోనూసూద్‌ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ముందుగా రేపటికి వారికి ఎద్దులను పంపుతానని ట్వీట్ చేశారు. తరువాత ఏమనుకున్నారో ఏమో సాయంత్రానికి ట్రాక్టర్ పంపుతానని చెప్పి ఆ ట్రాక్టర్ పంపారు. దీంతో సోనూని తెలుగు ప్రజలు అందరూ అభినందిస్తున్నారు.

More Related Stories