షాకింగ్.. రజినీకాంత్ కొత్త సినిమా ఆగిపోయిందా..Rajinikanth
2020-07-31 02:04:01

రాజకీయ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత కూడా రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు సూపర్ స్టార్. గతంతో పోల్చుకుంటే ఈ సినిమాల జోరు కూడా పెరిగిపోతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ మెంట్ ఇస్తున్నాడు రజనీకాంత్. ఈ ఏడాది ఇప్పటికే దర్బార్ సినిమాతో వచ్చాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాతై సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి వరకు చాలా వేగంగా జరిగింది. దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేశాడు దర్శకుడు శివ. కానీ అనుకోకుండా మధ్యలో కరోనా వైరస్ వచ్చి ప్లాన్స్ అన్ని పాడు చేసింది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయినట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అనుమతులన్నీ వచ్చాయి కదా కొన్ని రోజుల తర్వాత షూటింగ్ చేసుకుందాం అని రజనీకాంత్ ను చిత్ర నిర్మాతలు అడగడంతో.. ఆయన ఇప్పట్లో తాను షూటింగ్స్ కు రానని ఖచ్చితంగా చెప్పినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ మొత్తం తగ్గిపోయిన తర్వాత కానీ బయటకు రాను అని.. అప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉంటానని రజినీకాంత్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు రజిని. అప్పుడప్పుడూ ఆయన ఆరోగ్యం దెబ్బ తింటూ వస్తుంది కూడా. ఇలాంటి సమయంలో లేనిపోని రిస్కులు తీసుకోవడం మంచిది కాదని ఆయనకు వైద్యులు కూడా సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రస్తుతానికి ఒప్పుకున్న సినిమాలు కూడా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.  

More Related Stories