కొరటాల శివతో అల్లు అర్జున్ భారీ సినిమా.. Allu Arjun
2020-07-31 21:17:25

చిరంజీవితో ప్రస్తుతం ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్న కొరటాల శివ.. తన తర్వాత సినిమాని కూడా కన్ఫర్మ్ చేశాడు. సాధారణంగా ఒక సినిమా చేసేటప్పుడు మరో ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టని ఈ దర్శకుడు.. తన తర్వాత సినిమాను అల్లు అర్జున్ హీరోగా అనౌన్స్ చేశాడు. గీతా ఆర్ట్స్ 2 సమర్పణలో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ విడుదల చేశారు. 2022 మొదట్లో ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు నిర్మాతలు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేయాలని దర్శకుడికి అల్టిమేటం కూడా జారీ చేశాడు. షూటింగ్ మొదలైన తర్వాత బ్రేక్ లేకుండా పుష్ప పూర్తి చేయాలి అంటున్నాడు అల్లు అర్జున్. 

ఈ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. చిరంజీవి ఆచార్య సినిమా మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టినా కూడా ఫిబ్రవరి లోపు చిరంజీవి సినిమా పూర్తి చేసుకుని అల్లు అర్జున్ కోసం సమయం కేటాయించనున్నాడు ఈ దర్శకుడు. మొత్తానికి కొరటాల శివ అల్లు అర్జున్ ఈ కాంబినేషన్ పై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. గతంలోనే ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్న పరిస్థితులు అనుకూలించలేదు. అప్పుడు ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్లీ ఇప్పుడు వస్తుంది.

More Related Stories