కొరటాలను రామ్ చరణ్ కాదన్నాడా.. బన్నీ వైపు ఎందుకెళ్లినట్లు.. Ram Charan
2020-08-02 14:50:12

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాలో నటిస్తూనే మరోవైపు తండ్రి చిరంజీవి ఆచార్య సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. అంతేకాదు అందులో చిన్న పాత్రలో కూడా మెరుస్తున్నాడు మెగా పవర్ స్టార్. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై నిర్మిస్తున్నాడు చరణ్. ఈ సమయంలో ఈయన తర్వాతి సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది కానీ మొదలైన తర్వాత నెల రోజుల్లోనే ఆచార్యకు ముగింపు పలకాలని చూస్తున్నాడు కొరటాల శివ. ఆ తర్వాత ఈయన అల్లు అర్జున్ సినిమాకు కమిటయ్యాడు. మరోవైపు కొరటాల తర్వాత సినిమా రామ్ చరణ్ తోనే ఉంటుందనే ప్రచారం బాగానే జరిగింది. కానీ ఇప్పుడు సీన్ లోకి బన్నీ వచ్చాడు. దీనిపై చరణ్ కూడా ఏం మాట్లాడటం లేదు. అసలు ఈయన తర్వాతి సినిమా ఏమై ఉంటుందా అనే ఆసక్తి కూడా మొదలైంది. దీనికి సమాధానంగా ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

సాహో లాంటి భారీ సినిమా చేసిన సుజీత్.. వరస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. జెర్సీ లాంటి ఎమోషనల్ సినిమా చేసిన గౌతమ్ తిన్ననూరి. ఈ ముగ్గురు దర్శకుల్లో సుజీత్ ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్నాడు. లూసీఫర్ రీమేక్ కు ఈయన ఫిక్స్ అయ్యాడు. ఇక గౌతమ్ ప్యూర్ లవ్ స్టోరీ చెప్పాడని.. కానీ ప్రస్తుతం ఈయన హిందీ జెర్సీ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. దాంతో ఆయనతో ఇప్పట్లో సినిమా కుదరనట్లే. ఇక ఈ మధ్యే చరణ్ ను అనిల్ రావిపూడి కలిసి అదిరిపోయే లైన్ చెప్పాడని తెలుస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉండే ఈ కథకు చరణ్ కూడా ఫిదా అయినట్లు ప్రచారం జరుగుతుంది. 

అన్నీ కుదిర్తే ఈయనతోనే రామ్ చరణ్ సినిమా ఉంటుందంటుంది మెగా కంపౌండ్. ఈ మధ్యే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబుకు పెద్ద హిట్ ఇచ్చాడు ఈ దర్శకుడు. పైగా ఎఫ్3 కూడా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. అందుకే చరణ్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నాడు ఈ దర్శకుడు. కానీ బాలయ్యతో కూడా అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతున్న తరుణంలో చరణ్ నెక్ట్స్ సినిమా ఈయనతోనే ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సిందే. మొత్తానికి కొరటాలను చరణ్ కాదన్నాడా లేదంటే బన్నీ కావాలనుకున్నాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

More Related Stories