ప్యాన్ ఇండియన్ బయోపిక్ ఒప్పుకున్న రకుల్ Rakul preet singh
2020-08-05 15:12:00

ప్రస్తుతం ఇండియాలో అన్ని బాషలలో హిట్ అవుతూ నిర్మాతలకి కాసులు కురిపిస్తున్న ఏకైక జానర్ బయోపిక్. ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. అందునా క్రీడాకారుల బయోపిక్స్ కి ఇంకా క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం లేడీ క్రికేర్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్‌, షట్లర్ సైనా నెహ్వాల్‌, పి.వి సింధు, కపిల్‌ దేవ్, గోపీచంద్‌ వంటి దిగ్గజ క్రీడాకారుల జీవితాలని సినిమాలుగా మలుస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో బయిపిక్ కూడా చేరిన సంగతి తెలిసింది. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ మల్లీశ్వరి జీవితగాథను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పాన్‌ ఇండియన్ మూవీగా విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.  

శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన కరణం మల్లీశ్వరి చిన్నతనం నుంచి అనేక ఒడుదొడుకులు ఎదుర్కోని వెయిట్‌ లిఫ్టర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 2000 ఒలింపిక్స్‌లో భారత్‌ తరపున వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఇక ఈ సినిమాని ఇప్పుడు రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటించిన ‘రాజుగాడు’తో దర్శకురాలిగా తెరకు పరిచయమైన సంజన రెడ్డి తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా కోసం నిత్య మీనన్ అనుకున్నారు, కానీ ఆమె ఇప్పడు తాను చేయనున్నట్టు చెబుతున్నారు. అందుకే మళ్ళీ హీరోయిన్ కోసం వేట లో మేకర్స్ పడ్డారు. ఈ పాత్ర కోసం తాప్సీని అనుకున్నా ఆమె కూడా చేయనని చెప్పిందట, అందుకే ఇప్పుడు రకుల్ ని సంప్రదించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఒక్క సినిమా లేక డల్ గా ఉన్న ఆమె వెంటనే ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

More Related Stories