ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడిPrabhas
2020-08-07 08:50:22

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ప్రభాస్‌ స్వయంగా కారు నడుపుకుంటూ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డార్లింగ్‌ ని చూసేందుకు భారీగా అక్కడికి తరలి వచ్చారు. ఆఫీసులో ఉన్న ఉద్యోగులు, సందర్శకులలు ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. మాస్క్‌ ధరించిన ప్రభాస్‌ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే ఫొటోలకు పోజిచ్చారు. ప్రభాస్ తో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో  వైరల్‌గా మారాయి.  గత మార్చిలో విదేశాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ప్రభాస్‌ మళ్ళీ ఈరోజే కనిపించాడు. నిజానికి JULY 30, 2016 న అయన తన రేంజ్ రోవర్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ వచ్చారు. ఇప్పుడు మరో కార్ కోసం ఆయన ఆఫీస్ కి వచ్చారు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రాధేశ్యామ్`లో నటిస్తున్నాడు.

More Related Stories