కరోనాను జయించిన అభిషేక్ బచ్చన్Abhishek Bachchan
2020-08-09 00:12:16

కరోనా నుంచి అభిషేక్ బచ్చన్ కోలుకున్నారు. ఈ మధ్యాహ్నం నిర్వహించిన కరోనా టెస్ట్ లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లుగా అభిషేక్ బచ్చన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు వైద్య సేవలు అందించిన నానావతి ఆసుపత్రికి వైద్యులకు నర్సింగ్ స్టాఫ్ కి అభిషేక్ బచ్చన్ కృతజ్ఞతలు తెలియచేశారు. తాను ప్రామిస్ చేసినట్లుగా కరోనాని జయించానన్న అభిషేక్ బచ్చన్, తాను తన కుటుంబం కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్ధించిన అభిమానులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 11 న కరోనాతో నానావతి ఆసుపత్రిలో చేరారు అభిషేక్ బచ్చన్. ఇరవై ఎనిమిది రోజుల పాటు నానావతి ఆసుపత్రిలోనే ఉన్న అభిషేక్ బచ్చన్, ఈరోజు నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఇక ఇప్పటికే ఈ కుటుంబం మొత్తానికి కరోనా సోకగా అందులో ఈయన తప్ప అందరూ కోలుకున్నారు. ఈయన తండ్రి అభిషేక్ బచ్చన్, భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్యలు కోలుకుని ఇప్పటికే ఇంటికి వెళ్ళిపోయారు. చివరిగా కోలుకున్న అభిషేక్ ఇప్పుడు ఇంటికి వెళ్లనున్నారు.

More Related Stories