యంగ్ హీరోయిన్ తో బ్రహ్మాజీ ప్రేమాయణం...ఇదీ సంగతి Actor Brahmaji
2020-08-16 21:45:22

వయసు ముదిరినా సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటాడు నటుడు బ్రహ్మాజీ. ఎప్పటికప్పుడు తన సరదా ట్వీట్స్‌ అలరించే ఈ యాక్టర్ తాజాగా చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. విషయం ఏంటంటే లాక్ డౌన్ లో సినిమా వార్తలు పెద్దగా లేకపోవడంతో గాసిప్ లు ఇంతకు ముందుకన్నా ఎక్కువ అయ్యాయి. దీంతో ఈ వార్త మీద కౌంటర్ వేస్తూ ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. ఇంతకీ ఆ గాసిప్ ఏంటంటే యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ రూపొందనుందని, అందులో 50 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల యంగ్ హీరోయిన్‌ తో రొమాన్స్ చేయనున్నారని ఆ 50 ఏళ్ల వ్యక్తే బ్రహ్మాజీ అని తెలుపుతూ ఒక మీమ్ పేజ్ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ పోస్టర్ చూసిన బ్రహ్మాజీ.. వెంటనే రియాక్ట్ అవుతూ నేరుగా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌ని ప్రశ్నించారు. ‘‘రాహుల్ బ్రో.. ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఆ యంగ్ హీరోయిన్ ఎవరు?’’ అంటూ అడగడం ఆసక్తికరంగా మారింది. దీంతో బ్రహ్మాజీకి రాహుల్ రిప్లై ఇస్తూ వాళ్లకేం ఏదైనా రాసేస్తారు. కనీసం చెక్ కూడా చెయ్యరు. నా దగ్గరైతే స్క్రిప్ట్ లేదు. వాళ్ళే ఆ స్క్రిప్ట్ కూడా రాసేస్తే సూపర్‌గా ఉంటుందని పంచ్ వేశాడు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియా లో ఆకట్టుకుంటుంది.
 

More Related Stories