ఆచార్య ఫస్ట్ లుక్...అదుర్స్ అంతే Acharya first look
2020-08-23 09:30:06

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ ని కొద్ది సేపటి విడుదల చేశారు. గతంలో చిరు చెప్పినట్టు ‘ఆచార్య’ అనే పేరునే ఫైనల్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ధర్మస్థలి అనే ప్రాంతంలో చిరంజీవి కత్తిపట్టుకుని నిలబడి ఉండడం, ఆయన మెడలో ఎర్ర కండువా ఉండడంతో ఆయన విప్లవ నాయకుడిగా కనిపించనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ మోషన్ పోస్టర్ కి స్వరబ్రహ్మ మణిశర్మ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ గూజ్ బంప్స్ తెప్పిస్తోంది.  శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘ఆచార్య’ షూటింగ్‌ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే షూట్ ప్రారంభించేందుకు రెడీగా ఉంది టీమ్.

More Related Stories