అర్జున్ రెడ్డికి మూడేళ్లు.. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదుగా..Arjun Reddy
2020-08-25 17:57:40

అర్జున్ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు ఎందుకు..? శివ తర్వాత అంత ఇమేజ్.. పాత్ బ్రేకింగ్ సినిమా ఇదే. ఓ సినిమాను ఇలా కూడా తీయొచ్చా.. ప్రేమకథను ఇంత బోల్డుగా చూపించొచ్చా అనేలా అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా విడుదలై సరిగ్గా మూడేళ్లవుతుంది. అయినా కూడా ఇప్పటికీ ఈ సెగలు మాత్రం తగ్గలేదు. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయిపోయాడు. అప్పట్లో ఈ సినిమా 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాని కోసం సినిమా తీసుకున్న స‌మ‌యం కేవలం 14 రోజులు. 

రెండు వారాల్లోనే 42 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది అర్జున్ రెడ్డి. షేర్ 22 కోట్ల‌కు పైగా ఉంది. అంతా చేస్తే ఈ చిత్ర బ‌డ్జెట్ కేవ‌లం 3.2 కోట్లే.. అమ్మింది 6.5 కోట్లు. ఎలా చూసుకున్నా బ్లాక్ బ‌స్ట‌ర్ బాప్ కా బాప్ అనిపించుకుంది అర్జున్ రెడ్డి. ఈ చిత్రంతో మ‌నోడి మార్కెట్ రెండింత‌లు పెరిగింది. ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాలతో స్టార్ హీరో అయిపోయాడు విజయ్. అడ‌ల్ట్ కంటెంట్ తో వ‌చ్చిన అర్జున్ రెడ్డి ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. విమ‌ర్శలు.. వివాదాలు ఎన్ని వ‌చ్చినా కూడా విజ‌యం వెంటే తీసుకొచ్చింది. ఇవ‌న్నీ సినిమా రేంజ్ ను పెంచ‌డానికి ఇంకా హెల్ప్ అయ్యాయి. మూడేళ్లైనా కూడా ఇప్పటికీ అర్జున్ రెడ్డి గురించి ఏదో ఒక చోట టాపిక్ రన్ అవుతూనే ఉంటుంది. హిందీలో కబీర్ సింగ్ గా.. తమిళ్‌లో వర్మగా ఈ సినిమా రీమేక్ అయి విజయం సాధించింది. 

More Related Stories