బాబాయ్ సినిమాకి అబ్బాయ్ డైలాగే టైటిల్ NTR dialouge
2020-08-31 18:44:51

బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం మెనార్క్(వర్కింగ్ టైటిల్). మొన్నీమధ్యన బాలయ్య బర్త్ డే సందర్భంగా బోయపాటి విడుదల చేసిన టీజర్ ఫ్యాన్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. దీంతో ఈ సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో ఇప్పటీ వరకూ బాలయ్య పక్కన హీరోయిన్  ఖరారు కాలేదు.  నయనతార, అనుష్క, శ్రీయ ఇలా ఎంతోమంది పేర్లు వినిపించిన ఎవరినీ బోయపాటి టీమ్ ఫైనల్ చేయలేదు. అలానే విలన్ గురించి కూడా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ సినిమాలో నవీన్ చంద్ర, నవీన్ పోలిశెట్టి లాంటి వాళ్లు నటించనున్నారని ఆ మధ్య గట్టిగా ప్రచారం అయితే జరిగింది. అందులో ఎవరు నటిస్తున్నారో తెలీదు కానీ ఈ సినిమా టైటిల్ కి సంబంధించి కొత్త ప్రచారం మొదలయింది. 

అదేంటంటే ఈ సినిమాకి మోనార్క్‌ అని కాకుండా టార్చ్ బేరర్ అనే మరో టైటిల్ అనుకుంటున్నట్టు గట్టిగ ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ పదం ఎన్టీఆర్ అరవింద సమేతలో బాగా వినిపించింది. ఆ డైలాగ్ నే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కోసం అనుకుంటున్నట్టు చెబుతున్నారు. నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ చేత నటింపచేయాలని చూశారు. కానీ ఆర్ ఆర్ ఆర్ లాంటి ప్రాజెక్ట్ లో ఉన్న ఎన్టీఆర్ చేయడం రిస్క్ తో కూడుకున్నదని అందుకే చేయడం లేదని అంటున్నారు. ఇక ఇది అయినా నందమూరి అభిమానులకి పండగ చేసుకునే లాంటి న్యూస్ అని చెప్పక తప్పదు. ఈ మూవీ కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకొని కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలో తిరిగి సెట్స్ మీదకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

More Related Stories