గౌతమ్ కేక్ కటింగ్ పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్ Mahesh Babu
2020-09-01 14:13:53

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ నిన్న 14వ పుట్టిన రోజును జరుపుకున్నారు.. ఈ సందర్భంగా గౌతమ్ మహేష్ అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు గట్టిగానే తెలిపారు. ఇక ఎప్పుడూ లానే అమ్మా నాన్న, పిల్లలు, వారి ఫ్రెండ్స్ సమక్షంలో ఈ పుట్టిన రోజు వేడుకలు చాలా నిరాడంబరంగా జరిగిపోయాయి. ఈ కేక్ కటింగ్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్, నమ్రత దంపతులకి గౌతమ్ కృష్ణ 2006లో జన్మించాడు. మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో గౌతమ్ ఓ కీలక పాత్రతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక గౌతమ్ బర్త్ డే సందర్భంగా చిన్నప్పటి జ్ఞాపకాలను షేర్ చేస్తూ మహేష్ బాబు, నమ్రతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా గౌతమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. " మంచి వ్యక్తిత్వం ఉన్నవాడిగా నువ్వు పెరిగి పెద్దగా అవుతున్నందుకు గ‌ర్వంగా ఉంది. డొరేమాన్ టు అపెక్స్ లెజెండ్ వ‌ర‌కు నీతో క‌లిసి నేను జ‌ర్నీ చేయ‌డం హ్యాపీగా ఉంది. నీకిది గొప్ప పుట్టిన‌రోజు కావాలి" అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. నమ్రత కూడ గౌతమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. "నువ్వు మా జీవితాల్లోకి వ‌చ్చాక ఎంతో మార్పు వ‌చ్చింది. సంతోషం, ప్రేమ‌ను తెచ్చావు. ప్రతి ఏడాది ఇలానే జీవితంలో ప్రేమ‌, సంతోషం పెరుగుతూ రావాలి"అంటూ విషెస్ ని అందించింది. 

More Related Stories