వి మూవీ రివ్యూV Telugu Movie Review,
2020-09-05 16:56:32

క్యాస్ట్ : నాని, సుధీర్ బాబు, నివేదా, అదితి రావు హైదరి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి
నిర్మాత : దిల్ రాజు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇంద్రగంటి మోహన కృష్ణ
ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : తమన్
సంగీతం : అమిత్ త్రివేది
ఎన్నో అంచనాలతో ఓటీటీలో రిలీజ్ అయింది నాని, సుధీర్ బాబుల మల్టీ స్టారర్ మూవీ వి. ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. నాని 25వ సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

కథ :

ఆదిత్య (సుధీర్ బాబు) ఒక టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్. డ్యూటీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని ఆదిత్య పాత బస్తీలో ఒక గొడవని డీల్ చేసిన విధానినికి ప్రభుత్వం శౌర్య అవార్డ్ ప్రకటిస్తుంది. ఈ అవార్డ్ వచ్చినందుకు పార్టీ చేసుకుంటున్న క్రమంలో ఆదిత్య టీమ్ లోని ఒక ఆఫీసర్ హత్యకు గురవుతాడు. ఆ తర్వాత మరికొన్ని హత్యలు కూడా చేస్తానని చాలెంజ్ చేస్తాడు ఆ కిల్లర్(నాని). ఈ క్రమంలో ఆదిత్య లైఫ్ లోకి సైకాలజీ చదివిన అపూర్వ (నివేద థామస్) వస్తుంది. ఆ సైకోను పట్టుకోవడానికి ఆదిత్యకు తన వంతు ప్రయత్నం అందిస్తుంది. అసలు విష్ణు(నాని) ఎందుకు హత్యలు చేస్తున్నాడు.. ఎందుకు ఆదిత్యనే టార్గెట్ చేశాడు. మరి విష్ణుని ఆదిత్య పట్టుకున్నాడా లేదా.. అనేదే కథ.

విశ్లేషణ :

నాని పాత్ర రూపొందించిన తీరు కొత్తగా ఏమీ లేకున్నా, నానికి మాత్రం ఇది కొత్త పాత్రే. స్క్రీన్ ప్లేతో కట్టి పడేసే ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాలోనూ అదే ఫార్ములా వాడాడు. స్టోరీలో అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ కంటే ముందే వచ్చేయడంతో సినిమా సగం నుండే చప్పగా సాగింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఈ వి అంచనాలు అందుకోలేక అక్కడే చతికిల పడిపోయింది. నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంత బాలేక పోవడంతో సినిమా సోసోగా సాగింది. అందరూ ఊహించిన ట్విస్ట్ క్లైమాక్స్ ఇచ్చిన దర్శకుడు నాని, సుధీర్ బాబు ఇద్దరినీ హీరోలను చేశాడు. ఇంద్రగంటి కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు, మనకు తెలిసిన కధనే యాక్షన్ పార్ట్ బాగా దట్టించి వదిలాడు. సుధీర్ బాబు, నివేద థామస్ మధ్య కెమిస్ట్రీ అలానే నాని, అదితి రావు హైదరి ఫ్లాష్ బ్యాక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.

నటీనటులు:

సినిమాలో ఎవ్వరి నటనకూ వంక పెట్టలేము, అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. నాని కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించాడు. సుధీర్ బాబు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ లో దుమ్మురేపాడు.

ఫైనల్ గా : వి థియేటర్లో కాదు ఓటీటీ కాబట్టి నిర్మాతలు సేఫ్

రేటింగ్: 2.5/5.

More Related Stories