జోరుమీదున్న ధరమ్ తేజ్.. మరో సినిమా ఒప్పుకున్నాడా Sai Dharam Tej
2020-09-08 08:39:50

దాదాపు అరడజను సినిమాల ఫ్లాప్లు కొట్టాక చిత్రలహరి అనే సినిమా ద్వారా తేజూ మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. ఆ తరువాత తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే సినిమా ద్వారా మరో హిట్ కొట్టి మళ్ళీ మార్కెట్ లో నిలబడ్డాడు. ఇప్పుడు మనోడు హీరోగా సోలో న్రతుకే సో బెటరూ అనే సినిమా తెరకెక్కుతోంది. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉన్నా, ఇప్పుడు ఈ కరోనా వలన వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఆ సంగతి పక్కన పెడితే మొన్ననే ప్రస్థానం లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాని తెరకెక్కించిన దేవా కట్టా డైరెక్షన్ లో ఒక సినిమా ఓపెనింగ్ జరిగింది. ఇప్పుడు ఆ సినిమాలోనే మనోడు డాక్టర్ బాబు అవతారం ఎత్తనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

ఇది ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ అని అంటున్నారు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ ఫుల్ ముఖ్యమంత్రి పాత్రలో రమ్యకృష్ణ నటించబోతోందని అంటున్నారు. ఏలూరు నేపధ్యంలో సాగే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో 27 రోజుల్లో పూర్తి చేస్తారట. ఆ తర్వాత ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజ్, కొల్లేరు లాంటి ప్రాంతాల్లో మిగితా షెడ్యూల్ లను పూర్తి చేయనున్నారని అంటున్నారు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే మనోడు మరో సినిమా ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే సుకుమార్ కథనం అందించనున్న ఒక థ్రిల్లర్ కు సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పగా ఇప్పుడు  రచయిత ఆకుల శివ చెప్పిన కథకు కూడా తేజ్ ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయమై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. 

More Related Stories