నా పెళ్లి నా యిష్టం అంటున్న సాయి పల్లవి..Sai Pallavi
2020-09-11 08:33:16

సాయి పల్లవికి తెలుగులో ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వరస సినిమాలు చేసినా చేయకపోయినా ఆమె అంటే అందరికీ యిష్టమే. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలు.. ఎంచుకుంటున్న కథలు అలా ఉంటున్నాయి మరి. అయినా కూడా ఈ రోజుల్లో హీరోయిన్లు బాగా కమర్షియల్ అయిపోయారు. ఒక సినిమాకు సైన్ చేసే ముందు ఎన్ని కోట్లు తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ త‌ర్వాత లైఫ్ లో సెటిల్ అయిపోయి.. పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అలా ప్లాన్ కూడా చేసుకుంటారు. కానీ సాయిప‌ల్ల‌వి మాత్రం మ‌రోలా ఆలోచిస్తుంటుంది. సాయి పల్లవి గత సినిమాలు పడి పడి లేచే మనసు.. ఎన్జీకే, మారి 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు అర్జంటుగా హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితుల్లో ప‌డిపోయింది ప‌ల్ల‌వి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆమె ఆశ‌ల‌న్నీ విరాట‌ప‌ర్వం 1992, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాలపై ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె నిజ జీవితంలో పెళ్లికి దూరంగా ఉంటానంటుంది. దానికి కార‌ణం కూడా పెద్ద‌గా ఏం లేదు. ఒక్క‌సారి ఫిదా సినిమాను గుర్తు చేసుకుంటే స‌రిపోతుంది. అందులో నాన్న‌ను వ‌దిలిపెట్ట‌లేక పెళ్లి కూడా చేసుకోకుండా ఉండే భాన్సువాడ భానుమ‌తి పాత్ర‌. ఇప్పుడు నిజంగా కూడా ఇదే చేస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ‌. రియ‌ల్ లైఫ్ లో కూడా త‌న‌కు పేరెంట్స్ అంటే చాలా ఇష్ట‌మ‌ని.. అందుకే వాళ్ల‌ను చూసుకోడానికి పెళ్లికి దూరంగా ఉంటానంటుంది ఈ భామ‌. త‌న‌కు న‌చ్చిన‌వాడు దొరికినా కూడా పెళ్లికి నై అంటుంది ఈ బ్యూటీ. అమ్మా నాన్న‌ల కంటే త‌న‌కు పెళ్లి పెద్ద ఇంపార్టెంట్ కాదంటుంది సాయిప‌ల్ల‌వి. ఈ రోజుల్లో త‌మ లైఫ్ తాము చూసుకుని వెళ్ళిపోయే అమ్మాయిలే ఎక్కువ‌గా ఉంటారు. అలాంటిది సాయిప‌ల్ల‌వి మాత్రం అమ్మానాన్న‌ల కోసం త‌న లైఫ్ కూడా త్యాగం చేస్తానంటుంది. మొత్తానికి మ‌రి ఈమె త్యాగం నిజంగానే సాధ్య‌మ‌వుతుందో లేదో చూడాలిక‌.

More Related Stories