క్వారంటైన్‌లో మెగా బ్రదర్ నాగబాబుChiranjeevi
2020-09-16 16:29:25

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ కరోనా వచ్చేస్తుంది. సినిమా వాళ్లు కూడా ఇందులోనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కోవిడ్ బారిన పడి మళ్లీ కోలుకున్నారు. రాజమౌళి కుటుంబం కూడా పూర్తిగా కరోనా నుంచి కోలుకుని మళ్లీ పని మొదలు పెట్టారు. వాళ్ల కంటే ముందు తర్వాత కూడా చాలా మందికి కరోనా వచ్చింది.. పోయింది. దాంతో ఇప్పుడు ఇది వచ్చినా కూడా ఎవరూ పెద్దగా భయపడటం లేదు.. జాగ్రత్త పడుతున్నారంతే. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు కూడా కరోనా వచ్చింది. ఈయనకు కోవిడ్ పాజిటివ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఎందుకైనా మంచిదని ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. అందులో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈయన క్వారంటైన్ లో ఉన్నాడు. 14 రోజుల్లో అది తగ్గిపోతుందని వైద్యులు కూడా తెలిపినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మొన్నామధ్య కూతురు నిహారికతో కలిసి ఇంటర్వ్యూ చేసాడు నాగబాబు. అప్పుడే ఈ వైరస్ అటాక్ అయి ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు. ఏదేమైనా కూడా నాగబాబు త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. 

More Related Stories