కృష్ణవంశీతో రమ్యకృష్ణ నిజంగానే విడిపోయిందా.. ఇదే అసలు కథ.. Ramya Krishnan
2020-09-17 23:54:25

కొందరు హీరోయిన్లకు ఎంత వయసు వచ్చినా కూడా ఇమేజ్ మాత్రం తగ్గదు. వాళ్లను ఎవర్ గ్రీన్ స్టార్స్ అంటారు. అలాంటి వాళ్లలో రమ్యకృష్ణ కూడా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా రెండు దశాబ్దాల పాటు ఏలింది రమ్యకృష్ణ. ఆ తర్వాత కూడా తనదైన శైలిలో విభిన్నమైన పాత్రలు చేస్తూ సత్తా చూపిస్తుంది ఈ సీనియర్ హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ మధ్య తన 50వ పుట్టినరోజు జరుపుకుంది రమ్యకృష్ణ. తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు స్నేహితులకు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపింది రమ్యకృష్ణ. ఇదిలా ఉంటే ఈమె విషయంలో ఒక వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అవేంటంటే భర్త కృష్ణవంశీతో రమ్యకృష్ణ విడిపోయిందని. కొన్నేళ్లుగా ఇద్దరు కలిసి ఉండటం లేదని.. ఇద్దరి మధ్య మనస్పర్థలు తారస్థాయికి రావడంతో విడిపోయారు అంటూ ప్రచారం మొదలైంది.  దానికితోడు ఇద్దరూ బయట ఎక్కడా కలిసి కనిపించలేదు.. వేడుకలకు కూడా రారు.. సైలెంట్ గా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు.. ఇలాంటి విషయాలు పట్టించుకోనట్లు కనిపిస్తుంటారు.. దాంతో నిజంగానే రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోయారు అనే వార్తలు మరింత ఎక్కువగా వినిపించాయి. అన్నింటికి మించి ఈ మధ్య కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో తనకు తన భార్య సంపాదన ఎంతో తెలియదు అని.. ఆమె దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోను అంటూ సమాధానమిచ్చాడు. ఇది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అయితే తాజాగా రమ్యకృష్ణ బర్త్ డే వేడుకల్లో కృష్ణవంశీ కూడా ఉన్నాడు. ఈ ఒక్క ఫోటోతో తమ మధ్య గొడవలు లేవు అని స్పష్టం చేసింది ఈ జంట. ఇప్పటికైనా ఈ వార్తల ఫుల్ స్టాప్ కొడుతుందని ఆశిస్తున్నారు రమ్యకృష్ణ దంపతులు. 

More Related Stories