డ్రగ్స్ కేసు నిజాలు ఒప్పుకున్న దీపిక Deepika
2020-09-27 08:38:24

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యిన నటి, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి బాలీవుడ్ కు చెందిన పలువురి పేర్లు భయట పెట్టడంతో బాలీవుడ్ పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఎన్సీబీ విచారణలో దీపికా పదుకునే, శ్రద్దా కపూర్, రకుల్ ప్రీత్, సారా అలీఖాన్ ల పేర్లు భయటకు వచ్చాయి. దాంతో ఎన్సీబీ అధికారులు ఈ నలుగురికి సమన్లు జారీ చేశారు. కాగా విచారణలో భాగంగా రకుల్ ప్రీత్ శుక్రవారం ముంబై లోని ఎన్సీబి కార్యాలయంలో విచారణకు హాజరైంది. ఇక శనివారం దీపికా పదుకునే సైతం విచారణకు హాజరైంది. దాంతో అధికారులు దీపికను 4 గంటలపాటు విచారించారు. విచారణలో దీపిక సంచలన నిజాలు భయట పెట్టినట్టు జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. విచారణలో దీపికా 2017 అక్టోబర్ లో జయ సహా తో డ్రగ్స్ గురించి చాట్ చేసినట్టు ఒప్పుకుంది. దీపిక తన మేనేజర్ కరిష్మా ప్రకాష్, ఈవెంట్ మేనేజర్ సహా లతో జరిపిన చాట్ లో "మాల్" "హ్యాష్" అనే పదాలను వాడినట్టు సమాచారం.

More Related Stories