టెర్రరిస్టుగా సమంత..ఫ్యాన్స్ కి పండగేsam
2020-09-27 11:12:29

టాలీవుడ్ భామలు హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఎలాంటి రోల్ చేయడానికైనా సిద్ధమౌతున్నారు. ఇప్పటికే హీరోయిన్ తమన్నా నితిన్ హీరోగా నటిస్తున్న అందాదున్ చిత్రంలో నెగిటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా నెగిటివ్ రోల్ లో నటించడానికి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. సమంత సూపర్ హిట్ అయ్యింది వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ పార్ట్-2 లో నెగిటివ్ రోల్ టెర్రరిస్ట్ గా కనిపించనుందట. ఇక ఈ నిర్ణయంతో సామ్ ఓటీటీ లో నెగిటివ్ పాత్రలో అలరించనుంది. సమంత టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనుంది అనగానే ఆమె అభిమానులు షాక్ అవుతున్నారట.ఇదిలా ఉండగా అక్కినేని వారి కోడలు సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే మంచు లక్ష్మితో కలిసి స్కూల్ బిజినెస్ లో అడుగుపెట్టిన సమంత..ఇప్పుడు ఉపాసన తో కలిసి మెడికల్ కి సంబంధించిన ఓ బిసినెస్ ను స్టార్ట్ చేయనుందట. ఈ బిజినెస్ కు సంబంధించి ఉపాసన..సమంతను టాగ్ చేసి ఇద్దరూ కలిసి బిసినెస్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

More Related Stories